News March 31, 2025
NGKL: వివాహితపై అత్యాచారం.. ఆ వ్యక్తిదే కీలకపాత్ర!

ఊర్కొండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శనార్థం వచ్చిన<<15944914>> ఓ వివాహితపై జరిగిన అత్యాచార ఘటన<<>> సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి దేవాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుండగా.. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 29, 2025
దేవరకద్ర: చేప పిల్లలను వదిలిన మంత్రి, ఎమ్మెల్యే

గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని, మత్స్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి విమర్శించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టులో మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్తో కలిసి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవరకద్రలో ఈసారి 82 మిల్లీమీటర్ల సైజులో 2.5 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు.
News October 29, 2025
MBNR: భారీ వర్షాలు.. రంగంలోకి ఎస్పీ

గత రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి స్వయంగా పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు, రామయబోలి ట్యాంకుబండు, ఎర్రకుంట చెరువు, ఆలీ మార్ట్–రాయచూరు రహదారి ప్రాంతాలను సమీక్షించారు. మున్సిపల్, ఇరిగేషన్, వన్ టౌన్ CI అప్పయ్య తదితర అధికారులతో కలిసి నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు.
News October 29, 2025
మిడ్జిల్లో అత్యధిక వర్షపాత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండల కేంద్రంలో 119.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. జడ్చర్ల 84.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 82.8, బాలానగర్ 68.0, నవాబుపేట మండలం కొల్లూరు 64.3, మూసాపేట మండలం జానంపేట 63.0, మహమ్మదాబాద్, రాజాపూర్ 53.0, భూత్పూర్ 41.5, మహబూబ్ నగర్ గ్రామీణం 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.


