News February 21, 2025
NGKL: వివాహిత అదృశ్యం

ముగ్గురు పిల్లలతో సహా ఓ వివాహిత కనిపించకుండాపోయిన ఘటన తెలకపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. నడిగడ్డకు చెందిన చోటేమియాతో ఇర్ఫానాబేగంకు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా.. చోటేమియా అధిక వడ్డీ ఆశచూపి రూ.లక్షలు దోచుకోవటంతో జైలుకెళ్లాడు. దీంతో ఇర్ఫానాబేగం పిల్లలతో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. చోటేమియా జైలునుంచి రావటంతో ఈమె పిల్లలతో సహా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈమేరకు కేసునమోదైంది.
Similar News
News December 2, 2025
సూర్యాపేట: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

తుంగతుర్తి మండలం గుడితండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ జయపాల్ నాయక్ వినూత్న రీతిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాను సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆస్తులు కంటే ఎక్కువ సంపాదిస్తే తన ఆస్తులన్నింటినీ గ్రామస్థులు జప్తు చేయొచ్చని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శక పాలన అందిస్తానన్నారు.తనను గెలిపించాలని కోరారు.ప్రస్తుతం ఈ బాండ్ పేపర్ SMలో వైరల్గా మారింది.
News December 2, 2025
2వ రోజు 383 నామినేషన్లు దాఖలు.!

ఖమ్మం జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 6 మండలాల్లో సోమవారం సర్పంచ్ల పదవికి 383.. వార్డులకు 895 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో కలిపి కామేపల్లిలో S-49 W-142, KMM(R) S-65 W-167, KSMC S-87 W-153, MGD S-78 W-160, NKP S-70 W-155, T.PLM S-79 W-154 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో 2వ విడత నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.
News December 2, 2025
నల్గొండ: బంగారిగడ్డ ఎన్నికపై డీపీఓ వివరణ

చండూరు మండలం బంగారిగడ్డ ఎన్నికపై డీపీఓ వివరణ ఇచ్చారు. ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్ ప్రక్రియ.. 30వ తేదీ నాడు నామినేషన్ల పరిశీలన కూడా చేశామని.. ఈ నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. సర్పంచి బరిలో 11 మంది ఉన్నారని.. పది వార్డు స్థానాలకు 26 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని తెలిపారు. ఇప్పటి వరకు సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎవరూ కూడా ఉపసంహరించుకోలేదని చెప్పారు.


