News February 21, 2025
NGKL: వివాహిత అదృశ్యం

ముగ్గురు పిల్లలతో సహా ఓ వివాహిత కనిపించకుండాపోయిన ఘటన తెలకపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. నడిగడ్డకు చెందిన చోటేమియాతో ఇర్ఫానాబేగంకు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా.. చోటేమియా అధిక వడ్డీ ఆశచూపి రూ.లక్షలు దోచుకోవటంతో జైలుకెళ్లాడు. దీంతో ఇర్ఫానాబేగం పిల్లలతో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. చోటేమియా జైలునుంచి రావటంతో ఈమె పిల్లలతో సహా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈమేరకు కేసునమోదైంది.
Similar News
News March 19, 2025
ప.గో : అమ్మకు చీర కొనడానికి దొంగతనం.. చివరికి

ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.
News March 19, 2025
కశింకోట: హత్యకు గురైంది హిజ్రాగా గుర్తించిన పోలీసులు

కసింకోట మండలం బయ్యవరం వద్ద హత్యకు గురైంది హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మృతదేహంలో సగభాగాన్ని గోనె సంచులో పెట్టి బయ్యవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మిగిలిన అవయవాలను అనకాపల్లి డైట్ కళాశాల ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది ముందు మహిళగా పోలీసులు భావించారు. కాగా దర్యాప్తులో హిజ్రాగా నిర్ధారణ అయింది.
News March 19, 2025
ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.