News March 24, 2024

NGKL: వేడినూనె మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి

image

ఆమనగల్లులో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ బలరాం తెలిపిన వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లికి చెందిన అర్జున్.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బ్రహ్మోత్సవాల సందర్భంగా తినుబండారాల దుకాణం ఏర్పాటు చేశాడు. అయితే దుకాణానికి అతడితో పాటు వచ్చిన కుమారుడు జయదేవ్(3) అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వేడి నూనె ఒంటిపై పడింది. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం మృతిచెందాడని ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 13, 2024

అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ

image

అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.

News November 13, 2024

లగచర్ల దాడిలో 16 మంది అరెస్టు..

image

కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల దాడిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో అధికారులపై దాడికి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దీని తరువాత కొడంగల్ మెజిస్ట్రేట్‌లో హాజరు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

News November 13, 2024

కురుమూర్తి స్వామి హుండీ ఆదాయం @రూ.25,54,805

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద జాతర అయిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీని మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.25,54,805 వచ్చినట్లు ఈవో మధుమేశ్వరరెడ్డి చెప్పారు. ఈ బ్రహోత్సవాల్లో హుండీ లెక్కింపు ఇది తొలిసారి. అయితే ఉత్సవాలు ముగిసే వరకు మరో రెండుసార్లు లెక్కించే అవకాశం ఉంది. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారుల పర్యవేక్షణలో ఆదాయం లెక్కింపు జరిగినట్లు ఈవో తెలిపారు.