News July 3, 2024
NGKL: వ్యవసాయ పొలంలో చిరుత సంచారం
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని ఎంగంపల్లి తండా శివారులో వ్యవసాయ పొలంలో చిరుత పులి సంచరించింది. పరిసర రైతులు పొలంలో పాదముద్రలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు. వారు ఎంగంపల్లితండాలో చిరుత పులి సంచరించిన వ్యవసాయ పొలాల్లో అధికారులు పాదముద్రలను సేకరించారు. చిరుత సంచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News October 11, 2024
గద్వాల: కూతురు పుట్టిందని వేధింపులు.. ఫిర్యాదు
ఆడబిడ్డ పుట్టిందని వేధిస్తున్న భర్త, మామపై వివాహిత PSలో ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్రీనివాసులు వివరాల ప్రకారం.. ధరూర్ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన అరుణకు రెండు నెలల క్రితం ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి భర్త, మామలు వేధిస్తున్నారని, కర్రతో దాడి చేశారని పోలీసులకు అరుణ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
News October 11, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా రేవల్లిలో 31.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 24.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కృష్ణలో 13.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్ లో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 11, 2024
MBNR: DSCలో 967 పోస్టుల భర్తీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 967 మందికి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 1131 పోస్టులు ఉండగా 164 పోస్టులు పెండింగులో ఉన్నాయి. వీటిల్లో NGKL జిల్లాలో 59, మహబూబ్ నగర్ జిల్లాలో 29, గద్వాలలో 23, వనపర్తిలో 26, నారాయణపేటలో 27 పోస్టులను రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, కోర్టు కేసులు, తదితర కారణాలతో భర్తీ చేయలేదు.