News February 23, 2025

NGKL: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు.!

image

మహాశివరాత్రి సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మొత్తం 58 బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులను శివ స్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 7, 2025

NMMS పరీక్షకు 86 మంది గైర్హాజరు: DEO

image

జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన జాతీయ ఉపకార వేతన(NMMS) పరీక్షను ఆదివారం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో వెల్లడించారు. 2654 మంది విద్యార్థులు హాజరుకాగా, 2568 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 86 మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు.

News December 7, 2025

కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

image

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.

News December 7, 2025

పాడేరు: ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష

image

జిల్లా వ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. పరీక్ష కోసం మొత్తం 727 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 678 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించామన్నారు.