News March 15, 2025
NGKL: శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలపై సర్వే.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో 7,668 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. రోజుకు ఈ రోడ్డుపై సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన్ననూరు చెక్పోస్ట్ వరకు 6,880, వట్వర్లపల్లి ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుపై శ్రీశైలానికి, ఏపీకి ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.
Similar News
News March 16, 2025
ASF: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో 6వ, 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ శ్వేత తెలిపారు. విద్యార్థులు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
News March 16, 2025
భీంపూర్: రెండు ఉద్యోగాలకు ఎంపిక

భీంపూర్ మండలం అర్లీ(T) గ్రామానికి చెందిన రామెల్లి శివ గ్రూప్-3లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 481 ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 319 ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని శివ పేర్కొన్నారు.
News March 16, 2025
జహీరాబాద్లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

జహీరాబాద్ మండలం హుగ్గెల్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాన్ వెళ్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రదీప్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లెలు ఆశ(18) తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రదీప్ మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.