News January 28, 2025
NGKL: ‘సమయపాలన పాటించకపోతే చర్యలు’

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని నగర్ కర్నూల్ జిల్లా డీఈవో రమేష్ కుమార్ హెచ్చరించారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తరలించారు. తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Similar News
News November 22, 2025
ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
News November 22, 2025
ADB: ఆ తల్లి కడుపుకోత ఏ దేవుడు తీరుస్తాడు..!

వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. 4 రోజుల వ్యవధిలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువులు లోకం చూడకుండానే కన్నుమూశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగా పట్టించుకోరని ఖర్చుకు వెనకాడకుండా ప్రైవేటుకు వెళ్తారు. <<18346927>>MNCL<<>>(D)లో 2 పసిప్రాణాలు, NRMLలో <<18346927>>మరొకరు<<>>, ADBలో <<18346927>>తల్లిబిడ్డ <<>>చనిపోయారు. పుట్టిన బిడ్డ ఆదిలోనే మరణిస్తే ఆ తల్లి కడుపుకోత ఏ దేవుడు తీర్చలేడు.
News November 22, 2025
భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.


