News April 12, 2025
NGKL: సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం: ఎస్పీ

సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందిన సళేశ్వర జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యం, ఆహార వితరణ, క్యూలైన్ దర్శనం, మెడికల్ ఎమర్జెన్సీ, CC కెమెరాలు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ గురించి సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు.
Similar News
News October 19, 2025
KNR: మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ

ఉమ్మడి KNR జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి కరీంనగర్ జిల్లా(94)లో 2,519, జగిత్యాల(71)లో 1,766, పెద్దపల్లి(74)లో 1354, రాజన్న సిరిసిల్ల(48)1,324 దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి.
News October 19, 2025
ఏలూరులో నేటి మాంసం ధరలు ఇలా!

నూజివీడులో మాంసం ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో మటన్ రూ.800 రూపాయలు, చికెన్ రూ.220, రొయ్యలు రూ.300 రూపాయలు, చేపలు రూ.180 నుంచి 380 రూపాయలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో మటన్ రూ.900 రూపాయలు, చికెన్ రూ.220 నుంచి 280 రూపాయలు, కిలో చేపలు రూ.150 నుంచి 400 రూపాయలు, కిలో రొయ్యలు రూ.300 రూపాయలుగా విక్రయిస్తున్నారు.
News October 19, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం

పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు.