News April 15, 2025
NGKL: సళేశ్వరం జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సళేశ్వరం ఉత్సవాలకు మూడు రోజుల్లో దాదాపు 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు సళేశ్వరం ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగామయ్యను దర్శించుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం భక్తుల తాకిడికి దద్దరిల్లిపోయింది. వరుసగా రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అయింది.
Similar News
News December 5, 2025
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.
News December 5, 2025
వరి నారుమడిలో కలుపు యాజమాన్యం

వరి నారుమడిలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీని నివారణకు 5 సెంట్ల నారుమడిలో విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు పైరజోసల్ఫ్యూరాన్-ఇథైల్ 10% W.P లేదా ప్రిటిలాక్లోర్+సేఫ్నర్ 20mlను ఒక కిలో పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలాగే విత్తిన 15-20 రోజులకు గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు 5 సెంట్లకు 10 లీటర్ల నీటిలో బిస్పైరిబాక్ సోడియం 10% S.L 5ml కలిపి పిచికారీ చేయాలి.
News December 5, 2025
సిద్దిపేట: కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు.. ఉచిత చేప పిల్లలు: హరీశ్ రావు

కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు ఉచిత చేప పిల్లలు అందాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన గంగా భవాని ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించామమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సిద్దిపేట ఫిష్ మార్కెట్ను చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేశామన్నారు. గంగా భవానీ అమ్మవారి దయతో అందరికి అన్నింటా శుభం చేకూరాలన్నారు.


