News April 14, 2025
NGKL: సళేశ్వరం జాతర చివరి రోజు అపశ్రుతి

సళేశ్వరం జాతర చివరి రోజు స్వల్ప అపశ్రుతి జరిగింది. రద్దీ అధికంగా ఉండడంతో బస్సులో సీటు పట్టేందుకు వెళ్లి ఓ మహిళ గాయపడ్డారు. దర్శనం అనంతరం మహిళ రాంపూర్ పెంట వద్ద బస్సు రాగానే సీటు కోసం పరిగెత్తారు. డ్రైవర్ బస్సును తిప్పి పెట్టడానికి ప్రయత్నించగా మహిళ వెనక నుంచి వచ్చి టైర్ కింద పడబోయారు. ఘటనలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. డ్రైవర్ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
Similar News
News March 17, 2026
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)
News March 17, 2026
NZB: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈవీ టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ పంపు సెట్ల కోసం మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదన్నారు. https://tgobmms.cgg.gov.in సందర్శించాలన్నారు.
News March 17, 2026
‘మూడు రోజుల పాటు వర్ష సూచన’

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.


