News February 3, 2025
NGKL: సినిమాకు డబ్బులివ్వలేదని.. ఉరేసుకున్నాడు

సినిమాకు వెళ్లేందుకు తండ్రి డబ్బులివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబజార్ కాలనీకి చెందిన గణేశ్ కుమారుడు కార్తీక్(13) సినిమాకెళ్లేందుకు తండ్రిని డబ్బులడగగా, ఆయన మందలించాడు. తల్లిదండ్రులు బయటికెళ్లగానే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరిగొచ్చిన తల్లిదండ్రులు కుమారుడిని అలా చూసి గుండెలవిసేలా రోదించారు.
Similar News
News February 20, 2025
మహా కుంభమేళాను వాడుతున్న సినీ మేకర్స్

మహా కుంభమేళా సినీజనానికి మంచి అవకాశంగా మారింది. ఇప్పటికే బాలయ్య ‘అఖండ-2’కి కొంత షూటింగ్‌ను కుంభమేళాలో తీసినట్లు సమాచారం. తాజాగా తమన్నా నాగ సాధువుగా నటిస్తున్న ‘ఓదెల-2’ ప్రమోషన్లకి కూడా కుంభమేళా వేదికగా మారింది. మూవీ టీజర్‌ను ఈ నెల 22న అక్కడే లాంఛ్ చేయనున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు భక్తితో పాటు ఇటు సినిమా పనిని కూడా మూవీ టీమ్స్ చక్కదిద్దుకుంటున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
News February 20, 2025
భారత్‌లోకి ఐఫోన్ 16ఈ.. ధర ఎంతంటే..

భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించడంపై యాపిల్ కన్నేసింది. రూ.59వేలకే ఐఫోన్ 16ఈని తీసుకొస్తోంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ జీబీతో రానుంది. రేపటి నుంచే అడ్వాన్స్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి పూర్తి స్థాయి అమ్మకాలు మొదలవుతాయని యాపిల్ తెలిపింది. ఈ ఫోన్‌లో సింగిల్ కెమెరా మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఐఫోన్ SE అమ్మకాల్ని యాపిల్ భారత్‌లో ఆపేయనున్నట్లు సమాచారం.
News February 20, 2025
ఆధార్ బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయించాలి: కలెక్టర్

పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు.