News February 3, 2025
NGKL: సినిమాకు డబ్బులివ్వలేదని.. ఉరేసుకున్నాడు

సినిమాకు వెళ్లేందుకు తండ్రి డబ్బులివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబజార్ కాలనీకి చెందిన గణేశ్ కుమారుడు కార్తీక్(13) సినిమాకెళ్లేందుకు తండ్రిని డబ్బులడగగా, ఆయన మందలించాడు. తల్లిదండ్రులు బయటికెళ్లగానే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరిగొచ్చిన తల్లిదండ్రులు కుమారుడిని అలా చూసి గుండెలవిసేలా రోదించారు.
Similar News
News January 18, 2026
టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

న్యూజిలాండ్‌తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.
News January 18, 2026
మీకోసం కాల్ సేవలను ఉపయోగించుకోండి: కలెక్టర్

నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News January 18, 2026
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు మూడు పతకాలు

ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-12 బాలుర 400 మీటర్ల పరుగులో పి. గోవింద్ వెండి పతకం సాధించగా, అండర్-10 విభాగంలో జి. జితేష్ (60 మీటర్లు), అండర్-8 విభాగంలో మరో క్రీడాకారుడు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. జిల్లాకు మూడు పతకాలు రావడంపై అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు పరమేశ్వర్, వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు.


