News April 16, 2025
NGKL: సెలవుల్లో.. నల్లమల స్వాగతం పలుకుతోంది!

వేసవి సెలవులకు నాగర్ కర్నూలు జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా పచ్చని అడవులలో ఆహ్లాదకర వాతావరణంలో టూర్ ప్లాన్ చేసుకునేలా మంచి వేదిక కానుంది. అచ్చంపేట ఉమామహేశ్వరం శివాలయం, పచ్చని వాతావరణం, కొండలు, గుట్టలు కలిగి ఉన్న ప్రాంతం, అమ్రాబాద్ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ చూడ చక్కని ప్రదేశం. పర్యాటక ప్రాంతాలు సందర్శించి పచ్చని చెట్ల మధ్య విందు చేస్తూ ఆహ్లాదం పొందవచ్చు.
Similar News
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జోరు

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కల నెరవేరుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది. అర్హుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పనులు ప్రారంభమైన స్వల్ప కాలంలోనే నిధులు మంజూరై, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం.

శివతత్వంతోనే లోకానికి రక్ష: సామవేదం షణ్ముఖ శర్మ

శివతత్వంతోనే లోకానికి రక్షణ లభిస్తుందని ప్రవచనకర్త, వేద పండితులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. వేములవాడ క్షేత్రంలో ఏర్పాటు చేసిన శివ కారుణ్యం పురాణంపై ఆయన సోమవారం రాత్రి ప్రవచనం వినిపించారు. శివుడి ఆరాధనతో సమస్త మానవాళికి మేలు జరుగుతుందని, ప్రజలంతా దేవుడి ఆరాధనతో పాటు పరోపకారంతో ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈఓ రమాదేవి, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.