News April 2, 2025
NGKL: సైబర్ నేరాలపై పోలీస్ శాఖ అవగాహన సదస్సు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ(ఆర్ట్స్) కాలేజీలో నేడు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహించింది. కార్యక్రమంలో జిల్లా టౌన్ SI గోవర్ధన్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు ఎవరైనా గురైతే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, పోలీస్ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్ తొలగింపు.!

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.
News July 8, 2025
నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్‌డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్‌డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?
News July 8, 2025
స్టేషన్‌ఘన్‌పూర్‌లో రూ.800 కోట్లు ‘రప్పా.. రప్పా’

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రప్పా.. రప్పా డైలాగ్ హాట్ టాపిక్ అయింది. నియోజకవర్గ అభివృద్ధికి రప్పా.. రప్పా రూ.800 కోట్ల నిధులు తెచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలో పొందుపరిచారు. ఈ మధ్య ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.