News April 8, 2025
NGKL: స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. DEOకు ఫిర్యాదు

నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ KGBVలో 9వ తరగతి విద్యార్థిని యామిని చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరే టీచర్‌తో తమ కూతురు మంచిగా ఉంటుందనే అక్కసుతో కళ్యాణి అనే టీచర్ కక్షసాధింపు చర్యలపై మనస్తాపం చెంది యామిని ఆత్మహత్యకు యత్నించిందన్నారు. టీచర్ కళ్యాణిపై చర్యలు చేపట్టాలని DEO రమేశ్ కుమార్‌కు స్టూడెంట్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.
Similar News
News December 4, 2025
గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
News December 4, 2025
పోలీసుల ‘స్పందన’ లేక..

ఆకతాయి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ కుమార్తె <<18465236>>స్పందన<<>> (17) బలవన్మరణానికి పాల్పడి మరణించిందని తల్లిదండ్రులు వాపోయారు. బస్సులో యువకుడి వేధింపులపై తాము ఫిర్యాదు చేస్తే చెన్నేకొత్తపల్లి పోలీసులు పట్టించుకోలేదని, వారు సక్రమంగా వ్యవహరించి ఉంటే తమ బిడ్డను కోల్పోయేవారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు కడపుకోత మిగిలిందని బోరున విలపించారు.
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<


