News March 14, 2025

NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌ప‌ల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.

Similar News

News April 20, 2025

NLG: కమ్మని కల్లు.. మనసు జిల్లు!

image

ఈ ఏడాది జిల్లాలో కల్లుకు డిమాండ్‌ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడంతో ఎక్కువ మంది కల్లు కిక్కును కోరుకుంటున్నారు. ప్రస్తుతం తాటి కల్లు సీజన్‌ కావడంతో మందుబాబులు ఆ మత్తు పానీయం కోసం పరుగులు తీస్తున్నారు. ధర తక్కువ కావడంతో పేదలు, కూలీలు దీనిని సేవిస్తుంటారు. జిల్లాలో చాలాచోట్ల కల్లు ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది కల్లువైపే ఆసక్తి చూపుతున్నారు.

News April 20, 2025

జగిత్యాల: నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్ శ్యామల

image

జగిత్యాల వాసి గుగ్గిల మనోజ్ఞ నిర్మల్ డిపో బస్సు TS18T 4456లో పర్సును సీటుపై మర్చిపోయారు. డిపోలో బస్సును అప్పగించేటప్పుడు కండక్టర్ శ్యామలకు పర్సు కనబడింది. వెంటనే పర్సును డిపో క్లర్క్‌కు అప్పగించారు. అందులో రూ.2వేల నగదు, చెవి కమ్మలు ఉన్నాయి. ప్రయాణికురాలిని డిపోనకు పిలిపించి క్లర్క్ ఎన్.ఆర్ శేఖర్ అప్పజెప్పారు. కండక్టర్ శ్యామలను అభినందించారు.

News April 20, 2025

‘నిన్ను చాలా మిస్ అవుతున్నా’.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్

image

తన తల్లి ఇందిరా దేవిని గుర్తుచేసుకుని హీరో మహేశ్‌బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్‌డే’ అని అమ్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. కాగా 2022లో ఇందిరా దేవి చనిపోయిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!