News March 28, 2025

NGKL: అనాథ బాలికల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాత్సల్య అనాధ బాలికల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సబిత గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనాథ వసతిగృహంలో గదులను పరిశీలించారు. అందులో నివసిస్తున్న బాలికలకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. డోనర్స్ అందించిన వస్తువులను బాలికలకు అందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాష్ రూమ్‌లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Similar News

News February 22, 2026

సకల దేవతా స్వరూపమే ‘గోమాత’

image

గోవు ప్రాణి మాత్రమే కాదు. ముక్కోటి దేవతల నిలయం. గోమాత శరీరంలోని ప్రతి భాగంలోనూ ఓ దేవత కొలువై ఉంటారు. ముఖం మధ్యలో శివుడు, కళ్లలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీ దేవతలు, మెడ భాగంలో బ్రహ్మ, రాహు, కేతువులు, కాళ్లలో సరస్వతి, విష్ణుమూర్తి, విశ్వామిత్రుడు కొలువై ఉంటారు. ఉదరంలో భూమాత, తోకలో నాగరాజు, కొమ్ములలో ఇంద్రుడు నివసిస్తారు. అందుకే గోపూజ చేయడం వల్ల సకల దేవతలను ఆరాధించిన పుణ్యం లభిస్తుంది.

News February 22, 2026

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.

News February 22, 2026

గోవిందరావుపేట ఎంపీడిఓ కార్యాలయంలో మంటలు

image

గోవిందరావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని ముఖ్య ఫైళ్లు అగ్నికి ఆహుతవుతున్నట్లు సమాచారం. ఘటనతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాలా? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.