News April 1, 2025
NGKL: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. హీనంగా ప్రవర్తించారు..!

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శనివారం రాత్రి <<15944914>>యువతిపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారం <<>>చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మైకంలో 8 మంది వివాహితపై విచక్షణారహితంగా అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి పశువుల కంటే హీనంగా ప్రవర్తించారనే ప్రచారం సాగుతోంది. పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.
Similar News
News July 6, 2025
పాలమూరు: ఈ ఏడాది.. కొత్త స్కూళ్లు మంజూరు.!

ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. అన్ని వసతులు కల్పిస్తూ ప్రారంభించేందుకు DEOలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే MBNR-9,917, NGKL-9,010, GDWL-7,205, NRPT-8,454, WNPT-8,103 మంది విద్యార్థులు కొత్త అడ్మిషన్లు అయ్యారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
News July 6, 2025
సామర్లకోట: యువకుడి హత్య.. నిందితుల అరెస్ట్

సామర్లకోట మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు సీఐ కృష్ణ భగవాన్ శనివారం తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, దర్యాప్తులో హత్యగా తేలిందని ఆయన వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 103(1), 238(a) r/w 3(5) బీఎంఎస్ కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.
News July 6, 2025
శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.