News August 12, 2024

NGKL: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి వ్యక్తి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉయ్యాలవాడలో స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 1, 2024

MBNR: DSC ఫలితాలు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇక్కడే..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో DSC 1:3 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. MBNR-243 పోస్టులకు గాను 729 అభ్యర్థులు(మెట్టుగడ్డలోని డైట్ కళాశాలలో), NGKL-285 పోస్టులు(885)(లిటిల్ ఫ్లవర్ పాఠశాల), NRPT-279 పోస్టులు(837) (MLA క్యాంప్ ఆఫీస్ సమీపంలోని ఎస్సీ హాస్టల్), GDWL-172 పోస్టులు (516)(ZPHS బాలుర స్కూల్), WNPT-152 పోస్టులు(456)(బాలికల ఉన్నత పాఠశాల) సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.

News October 1, 2024

యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్

image

యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.

News September 30, 2024

NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.