News March 24, 2025
NGKL: ఆంగ్ల పరీక్షకు 10,537 మంది హాజరు

నాగర్ కర్నూల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఆంగ్ల పరీక్షకు 10,537 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. 25 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
Similar News
News September 15, 2025
చీనీ, నిమ్మలో తెగుళ్లు.. నివారణ

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు(ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.
News September 15, 2025
నవంబర్‌లో టెట్: కోన శశిధర్

AP: మెగా DSCలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది DSC నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్‌లో టెట్ ఉంటుందని, ప్రిపేర్ కావాలని సూచించారు.
News September 15, 2025
నిర్మల్ కోటలు.. నిర్మాణ శైలికి నిదర్శనాలు..!

నిర్మల్ జిల్లాలోని కోటలు, కట్టడాలు నాటి వైభవానికి, అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తున్నాయి. నిర్మల్ చుట్టూ ఉన్న 32 గాడ్లు, కోటలు, సోన్ బ్రిడ్జి, గాజుల్ పెట్ చర్చి, కదిలి, దేవరకోట, ఇంకా ఎన్నో ఆలయాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరినప్పటికీ మిగిలినవి నాటి ఇంజినీర్ల పనితనానికి నిలువెత్తు నిదర్శనాలు. ఈ పురాతన కట్టడాలు నేటి ఇంజినీర్లకు సైతం సవాల్‌గా నిలుస్తున్నాయి.