News October 13, 2025
NGKL: ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకే సీపీఆర్

ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ నిర్వహించే విధానాలను తెలుసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) పై అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టరేట్ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ జిల్లా అధికారులకు సీపీఆర్ ప్రక్రియను వివరంగా చూపించారు.
Similar News
News October 13, 2025
‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.
News October 13, 2025
GWL: రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై కన్జ్యూమర్ అఫైర్స్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులతో పాల్గొని ఏర్పాట్ల గురించి వివరించారు.
News October 13, 2025
30 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు: కృష్ణదేవరాయలు

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం అంగీకారం తెలిపిందని FCI కన్సల్టేటివ్ కమిటీ ఛైర్మన్ కృష్ణదేవరాయలు తెలిపారు. గత ఏడాది 15.92 లక్షల టన్నులు సేకరించిందని చెప్పారు. 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10% బ్రోకెన్‌తో కొనుగోలు చేస్తారని, పంజాబ్ తరువాత ఏపీకే ఈ అవకాశం దక్కిందన్నారు. SKLM, VZM, పల్నాడు జిల్లాల్లో రాష్ట్రం స్థలాన్ని చూపిస్తే కొత్తగా గోడౌన్లను నిర్మిస్తామని వివరించారు.