News March 22, 2025
NGKL: ఆ పథకం దరఖాస్తుకు ఈనెల 31 లాస్ట్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 31 చివరి తేదీ జిల్లా అధికారి షాబుద్దీన్ తెలిపారు. 21-24 వయసు, పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, బ్యాచిలర్ డిగ్రీ పూర్తయి ఉన్న వారు అర్హులు. నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థుల ఖాతాలో నేరుగా జమ చేస్తారని తెలిపారు.
Similar News
News December 16, 2025
పూతలపట్టు: హైవేపై ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన బస్సు

పూతలపట్టు మండలం కిచ్చన్న గారి పల్లి సమీపంలో ఆరు లైన్ల జాతీయ రహదారిపై లారీని బస్సు ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం రాత్రి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రయివేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు
News December 16, 2025
MDK: ఓట్లకు నోట్ల వాన..!

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్ల వాన కురుస్తోంది. అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మూడో విడత రేపు (17న) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ధూళిమిట్ట మండలంలోని ఓటుకు కనీసం రూ.500 నుంచి రూ.2 వేలకు పైనే పంపిణీ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చి, ఓటు వేయాలని కోరుతున్నారు. మద్యం పంపిణీ కూడా జోరుగా సాగుతుందని ఆరోపణలొస్తున్నాయి.
News December 16, 2025
కర్నూలు: మీ ముగ్గులు మా Way2Newsలో..!

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మా Way2Newsకి పంపండి. మీ పేరుతో మేము పబ్లిష్ చేస్తాం.
ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి.


