News September 3, 2025
NGKL: ఈనెల 5న జీపీఓ నియామక పత్రాల అందజేత: కలెక్టర్

ఈనెల 5న HYDలోని హైటెక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జీపీఓ నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరాలు వెల్లడించారు.
Similar News
News September 5, 2025
HYD: కోర్టు హాల్‌లో దురుసు ప్రవర్తన.. హై కోర్ట్ ఆగ్రహం

కోర్టు హాల్‌లో దురుసుగా ప్రవర్తించిన పిటిషనర్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సివిల్ సూట్ రివ్యూ పిటిషన్‌పై తీర్పు ఎందుకు ఇవ్వరంటు జడ్జితో పిటిషనర్ దురుసుగా ప్రవర్తించాడు. పిటిషనర్ చెన్నకృష్ణారెడ్డి సీనియర్ సిటిజన్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నుంచి జడ్జి జస్టిస్ నగేశ్ తప్పుకున్నారు. సీజే బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని కోర్ట్ ఆదేశించింది.
News September 5, 2025
ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించిన బెస్ట్ టీచర్ మన మిద్దె

గుడివాడ SPS హైస్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసే మిద్దె శ్రీనివాసరావు.. శ్రీనిసైన్స్ మైండ్ వెబ్‌సైట్ ద్వారా రూ.లక్షల విలువైన ప్రాజెక్టు వర్కు, స్టడీ మెటీరియల్‌ను ఫ్రీగా ఉపాధ్యాయులకు అందించారు. ఏ.కొండూరు (M) పోలిశెట్టిపాడుకు చెందిన ఆయన DSC(2000)లో ఎంపికై గుడివాడలో టీచర్‌గా చేరారు. 7,8,9 క్లాసుల పాఠ్యపుస్తకాల రూపకల్పనలో సైతం ఆయన పనిచేశారు. ఆయన సేవలకు 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది.
News September 5, 2025
KNR: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా శ్రీవాణి

శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం అధిపతిగా, విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా విధులు నిర్వహిస్తున్న డా.కోడూరి శ్రీవాణిని ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రం అందుకోనున్నారు.