News March 28, 2025
NGKL: ఉప్పునుంతలలో 40.0 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా ఉప్పునుంతలలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, వంగూర్, నాగర్ కర్నూల్ 39.9, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి 39.8, కోడేరు 39.7, బిజినపల్లి, చారకొండ 39.6, కొల్లాపూర్, కల్వకుర్తి 39.3, వెల్దండ 39.1, అచ్చంపేట 39.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 1, 2026
ఇరాన్ దాడుల్లో ముగ్గురు మృతి.. 58 మందికి గాయాలు: UAE

ఇరాన్ తమ దేశంపై చేసిన దాడుల్లో ముగ్గురు మరణించగా, 58 మంది గాయపడ్డారని UAE వెల్లడించింది. మృతులు పాక్, నేపాల్, బంగ్లాకు చెందిన వారు అని, గాయపడ్డ వారిలో భారత్‌తో పాటు మరో 14 దేశాల వారు ఉన్నారంది. 541 ఇరానియన్ డ్రోన్లు, 165 బాలిస్టిక్ మిస్సైల్స్, 2 క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఈరోజు ఉదయం 20 బాలిస్టిక్ మిస్సైళ్లను ధ్వంసం చేశామని, 8 సముద్రంలో పడ్డాయని పేర్కొంది.
News March 1, 2026
KNR: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరు

కరీంనగర్ లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షకు 311 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.నాగైలేశ్వర్ తెలిపారు. ఫలితాలను హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారని, ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ఇతర వివరాలకు ఎస్సీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు.
News March 1, 2026
ఘనంగా నిర్వహించిన వెటర్నరీ డాక్టర్స్ స్పోర్ట్స్ మీట్

కరీంనగర్లోని తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జిల్లా వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. TNGO ప్రెసిడెంట్ దారం శ్రీనివాస్ రెడ్డి, JAC కన్వీనర్ TGO ప్రెసిడెంట్ మడిపల్లి కాళిచరణ్, టీన్జీవో సెక్రటరీ లక్ష్మణ్ రావు, కార్యదర్శి అరవింద్ రెడ్డి ఉన్నారు.


