News February 10, 2025
NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 25, 2026
1,013 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంచిన UPSC

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS)ఎగ్జామినేషన్‌కు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పొడిగించింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. CSE ద్వారా 933 పోస్టులను, IFS ద్వారా 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.upsc.gov.in
News February 25, 2026
రష్మిక-విజయ్ దేవరకొండ ఆస్తులు ఎంతో తెలుసా?

రష్మిక ఒక సినిమాకు రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని ఫిల్మ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ప్రమోషన్ల రూపంలో ఆదాయం వస్తోంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవాలో ప్రాపర్టీలు ఉన్నాయి. ఆమె ఆస్తుల విలువ రూ.66 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక విజయ్ ఆస్తులు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చట. ఆయన ఒక సినిమాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు.
News February 25, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.


