News October 10, 2025

NGKL: ఎన్నికలు వాయిదా.. అయోమయంలో నాయకులు

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. నామినేషన్లు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో 10 జడ్పిటిసి, 115 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు చేపట్టారు. అంతలోనే ఎన్నికలు వాయిదా పడడంతో నేతలు కంగు తిన్నారు.

Similar News

News October 10, 2025

మరియాకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌కు నిరాశ

image

2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది. డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వెనిజులాను ఆమె డిక్టేటర్‌‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. అటు ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నిరాశే మిగిలింది.

News October 10, 2025

ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

image

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారుల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాద‌వ‌న్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప‌త్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణ‌యించింద‌ని, ఈ విష‌యాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

News October 10, 2025

గద్వాల్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

image

సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈనెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు.