News December 8, 2025

NGKL: ఎన్నికల విధులకు డుమ్మా.. షోకాజ్ నోటీసులు

image

గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల శిక్షణకు హాజరుకాని 206 మంది పోలింగ్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం తెలిపారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు శిక్షణకు హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులను అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని, 24 గంటలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

Similar News

News December 11, 2025

బోధన్: అత్తపై కోడలు ఘన విజయం

image

బోధన్ మండలం లంగ్డాపూర్‌లో అత్తపై కోడలు విజయం సాధించింది. అత్త బెల్లిడీగ గంగామణి పై కోడలు బెల్లిడీగ శోభారాణి ఘన విజయం సాధించింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరగగా శోభారాణి 232 ఓట్ల తేడాతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 424 ఓట్లు ఉండగా గంగామణికి 93 ఓట్లు, శోభారాణికి 325 ఓట్లు పోలయ్యాయి.

News December 11, 2025

మెదక్: 88.46% ఓటింగ్‌గా తేల్చిన అధికారులు

image

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.

News December 11, 2025

టాస్ గెలిచిన భారత్

image

ముల్లాన్‌పూర్ వేదికగా రెండో టీ20లో భారత్-సౌత్ ఆఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్, గిల్, సూర్యకుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి
SA ప్లేయింగ్ XI: రీజా, డికాక్, మార్క్రమ్(C), బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, లిండే, జాన్సెన్, సిపామ్లా, లుంగి ఎంగిడి, బార్ట్‌మన్