News March 24, 2025
NGKL: ఎస్ఎల్బీసీ ఘటన.. సీఎం ఆదేశాలు

ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయకచర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయించి, సొరంగంలో డ్రిల్, బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆ ఏడుగురికి పరిహారం చెల్లింపుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని, తాత్కాలిక చర్యలే కాకుండా శాశ్వత చర్యలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News March 26, 2025
లంచ్‌లో వీటిని తీసుకుంటున్నారా?

కొందరు మధ్యాహ్న భోజనంలో ఏది పడితే అది తింటుంటారు. కానీ ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం ఎక్కువగా సలాడ్లు తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. క్వినోవా, రోటీ, బ్రౌన్ రైస్, పెరుగు తినాలి. ఇవి జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పండ్లు తింటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. లంచ్‌లో గుడ్లు, చేపలు తినడం ఉత్తమం.
News March 26, 2025
గాజువాకలో యువకుడి సూసైడ్

గాజువాక మండలం B.C రోడ్డులోని వాంబేకాలనీలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న పవన్(21) ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే కారణంగా చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 26, 2025
అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.