News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 19, 2025
వనపర్తి జిల్లా కలెక్టర్ గమనిక

ఏప్రిల్ 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే, రాబోయే ఎన్నికల్లో ఓటరుగా అవకాశం లభిస్తుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఫామ్ 6,7,8పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.
News March 19, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం.. మహిళ ఆత్మహత్య

ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిజినపల్లి వాసి బత్తుల లక్ష్మి(48) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించేసరికి ఇంట్లో మంటలు ఎగిసిపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సయ్యద్ అలీ తెలిపారు.
News March 19, 2025
యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల పక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల నిర్మాణాల పనుల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీవోలతో ఇందిరమ్మ ఇళ్లకు, తాగు నీరు, పన్ను వసూళ్లు, ఎల్అర్ఎస్‌లపై అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి మండలాల వారిగా సమీక్షించారు.