News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో గత నెల 14వ తేదీన బాలికిపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 1, 2026
చిత్తూరు జిల్లాలో 93% పింఛన్ల పంపిణీ

జిల్లాలో శనివారం 93.10 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,33,419 మందికి గాను తొలి రోజున 2,17,324 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు అందజేశామన్నారు. మార్చి ఒకటిన ఆదివారం సెలవు కావడం తో, 2న సోమవారం మిగిలిన 16,095 మందికి పింఛన్లు అందించనున్నట్లు పీడీ పేర్కొన్నారు.
News March 1, 2026
ఎంజీయూ ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల షెడ్యూల్

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల సమయ పట్టికను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. 8వ సెమిస్టర్ (రెగ్యులర్ & బ్యాక్‌లాగ్) పరీక్షలు మార్చి 11 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. అలాగే 3, 5, 7, 9 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల వివరాలను ఎంజీయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
News March 1, 2026
చిత్తూరు: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,528 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. మార్చి 13 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.


