News January 25, 2026

NGKL: ఐద్వా జాతీయ సభలకు తరలి వెళ్లిన మహిళలు

image

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలకు ఆ సంఘం నాయకులు, మహిళలు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఆదివారం తరలి వెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో సమావేశానికి వెళ్లారు. ఈ సమావేశాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ సమావేశాల్లో దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని ఐద్వా సంఘం నాయకులు తెలిపారు.

Similar News

News February 23, 2026

పాలమూరు:రైతు భరోసా.. ఎప్పుడొచ్చేనో?

image

ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-2,44,853, NGKL-3,29,128, GDWL-1,79,052, WNPT-1,87,633, NRPT-1,90,153 మంది రైతులు ఉన్నారు. నవంబర్ లోనే రైతు భరోసా అందవలసి ఉండగా.. భూముల సర్వే (ధరణి) ప్రక్రియ, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

News February 23, 2026

AIADMK హామీలు: మహిళలకు ₹2,000.. పురుషులకూ ఫ్రీ బస్సు!

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో AIADMK చీఫ్ పళనిస్వామి హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు ₹2,000 సాయం అందిస్తామన్నారు. మహిళలతో పాటు పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని, పేదలకు ఇళ్లు, ఆటో డ్రైవర్లకు సబ్సిడీలు ఇస్తామని ప్రామిస్ చేశారు. DMK సర్కార్ ఒక ‘ఫెయిల్యూర్ మోడల్’ అంటూ విమర్శలు గుప్పించారు.

News February 23, 2026

బాఫ్టాలో భారతీయ సినిమా ‘బూంగ్’ చరిత్ర.. బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా అవార్డు!

image

BAFTA-2026 అవార్డుల్లో మణిపురీ చిత్రం ‘Boong’ సత్తా చాటింది. ‘బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం’ కేటగిరీలో అవార్డు గెలుచుకొంది. ఈ విభాగంలో బాఫ్టా అవార్డు అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘జూటోపియా 2’ వంటి సినిమాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు.