News December 15, 2025

NGKL: ఓడిన అభ్యర్థులకు డబ్బులు తిరిగి ఇస్తున్న ఓటర్లు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ, వంగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థులకు ఓటర్లు వారు ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇస్తున్నట్లు సమాచారం. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయిన అభ్యర్థులు విలపించడం చూసి చలించిపోయిన కొందరు ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 17, 2025

నాలుగో టీ20కి స్టార్ ప్లేయర్ దూరం!

image

దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కి భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ దూరమైనట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాలి వేలికి గాయం కావడంతో ఆయన మ్యాచ్ ఆడట్లేదని వెల్లడించాయి. కాగా తొలి మూడు టీ20ల్లోనూ గిల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు. అటు పొగమంచు కారణంగా ఇవాళ్టి మ్యాచ్ టాస్‌పై అంపైర్లు 7.30pmకి నిర్ణయం తీసుకోనున్నారు.

News December 17, 2025

BREAKING: విజయవాడలో ప్రమాదం.. మహిళ కాళ్లు ఛిద్రం..!

image

విజయవాడ సిటీ బస్టాండ్‌లో ఘోరం చోటు చేసుకుంది. కాళేశ్వరరావు మార్కెట్ నుంచి రామవరప్పాడు వెళ్లే 77వ నంబర్ బస్సు ఓ మహిళ ఎక్కుతుండగా.. బస్సు కదిలింది. దీంతో మహిళ కిందపడిపోయింది. డ్రైవర్‌ ఆపకుండా ముందుకు వెళ్లడంతో బస్సు ఆమె రెండు కాళ్లపై నుంచి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మహిళ రెండు కాళ్లు ఛిద్రమైపోయాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 17, 2025

ములుగు జిల్లాలో బోణీ కొట్టిన సీపీఎం

image

ములుగు జిల్లాలో మొదటిసారి సీపీఎం బోణీ కొట్టింది. వెంకటాపురం మండలం భోదాపురం గ్రామ పంచాయతీలో సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోర్స నరసింహారావు గెలుపొందారు. నరసింహారావుకు 145 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో సీపీఎం నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.