News February 6, 2025
NGKL: కడుపునొప్పి భరించలేక.. వ్యక్తి బలవన్మరణం

తీవ్రమైన కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన గంగనమోని భాగయ్య(58) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.
Similar News
News November 4, 2025
అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా: లోకేశ్

AP: అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే వైసీపీ చీఫ్ <<18199297>>జగన్<<>> మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘తుఫాను వేళ సీఎం నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు ప్రజల వద్దే ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు మేమేం చేశామో తెలిసేందుకు మీరిక్కడ లేరు. నాకు మహిళలంటే గౌరవం, అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా. తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు.
News November 4, 2025
ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.
News November 4, 2025
మన్యం కేఫ్ పరిశీలించిన DRDA పీడీ

పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఆవరణలో DRDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మన్యం కేఫ్‌ను DRDA పీడీ ఎం.సుధారాణి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మకాలను పరిశీలించారు. మన్యం జిల్లా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కేఫ్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నామని, ప్రజలు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు.


