News September 3, 2025
NGKL: కబడ్డీ.. పాలమూరు బిడ్డ ఆల్ టైం రికార్డు

ఉమ్మడి పాలమూరు జిల్లా పదర మండలనికి చెందిన బండి రమేశ్-రమాదేవిల కుమార్తె నందిని U-18 విభాగంలో ఇండియా కబడ్డీ క్యాంపుకు ఎంపికయింది. గత నెల 28 నుంచి శిక్షణ ప్రారంభమైంది. 2 సార్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మున్ననూర్ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఈమె రాష్ట్ర స్థాయి అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. జాతీయ స్థాయి సబ్ జూనియర్ టోర్నీలో 2 సార్లు ఎంపికయింది.
Similar News
News September 4, 2025
టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ-క్రాప్ నమోదు ఆధారంగా టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంటలు సాగుచేసిన వివరాలు, ఆ పంటలు జాబితా వాటికి అవసరమయ్యే యూరియా మోతాదును డివిజన్, మండల, రైతు సేవ కేంద్రాల వారిగా నమోదు చేసుకోవాలన్నారు.
News September 4, 2025
ఎన్టీఆర్: లా విద్యార్థులకు అలెర్ట్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో LL.B 2, 4వ సెమిస్టర్(2024-25 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 13, 27 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News September 4, 2025
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.