News August 20, 2025

NGKL: కరెంట్ తీగలు… కడుపు కోతకు కారణమయ్యాయి!

image

గణపయ్యను హర్షధ్వానాలతో ఊరేగింపుగా తీసుకువస్తుండగా, ఆ మార్గంలో వేలాడుతున్న కరెంట్ తీగలు ఆ యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆనందంగా మొదలైన వేడుక ఒక్కసారిగా విషాదంలోకి మారింది. స్థానికుల వివరాలు.. కోడేరు(M) నాగులపల్లితండా వాసి టోని(24) HYDలోని బండ్లగూడలో కుటుంబంతో నివాసముంటున్నారు. ట్రాక్టర్‌పై నిన్న భారీ వినాయకుడిని తీసుకొస్తున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న టోనికి కరెంటు వైర్లు తగిలి చనిపోయాడు.

Similar News

News August 20, 2025

బెల్లంపల్లి: తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

image

సింగరేణి ఆధ్వర్యంలో యువతకు తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సింగరేణి పరిసర ప్రాంతాల నిరుద్యోగులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సంస్థ ఉచిత శిక్షణ ఇవ్వనుందన్నారు. తేనెటీగల పెంపకం పట్ల శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5గంటల లోపు GMకార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు.

News August 20, 2025

మెదక్: ‘మళ్లీ జైలుకు రావొద్దు’

image

మెదక్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.సుభవల్లి తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న వసతులు, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ సలహాలు ఇచ్చారు. మీరు తప్పులు చేసి జైలుకు వస్తే మీ వల్ల మీ కుటుంబం ఇబ్బందులకు గురవుతుంది. మానసికంగా క్షోభకు గురవుతారన్నారు. కావున ఒకసారి జైలు నుంచి బయటకు వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ తప్పులు చేసి జైలుకు రావొద్దని సూచించారు.

News August 20, 2025

KNR: ప్రభుత్వం స్కూల్లో ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్

image

అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 34 పాఠశాలలను గుర్తించి వాటిలోని అంగన్వాడీ కేంద్రాలను తరలించి ఫ్రీ ప్రైమరీ విద్య అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా KNR జిల్లాలో ఇల్లందకుంట మం. వాగొడ్డు రామన్నపల్లి, వీణవంక మం. దేశాయిపల్లి, తిమ్మాపూర్ మం. గొల్లపల్లి, గంగాధర మం. సర్వారెడ్డిపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు.