News January 29, 2025

NGKL: కార్యాచరణ ప్రకటించిన జిల్లా జేఏసీ నేతలు

image

నాగర్ కర్నూల్ జిల్లా వివిధ మండలాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు రేపటినుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని జిల్లా జేఏసీ ఛైర్మన్ నల్లగంటి బాలయ్య తెలిపారు.  ప్రతి మండలంలో ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఆనంద్ కుమార్, భాస్కర్, క్రాంతి కుమార్, రాజేష్ కుమార్ బాలకృష్ణ, రవిరాజ్, జీవన్ ప్రకాష్,ఆసిఫ్, నారాయణ తెలిపారు.

Similar News

News November 8, 2025

48 గంటల్లో ఆలయాలు కట్టించాలి.. బండి సంజయ్ వార్నింగ్

image

రామగుండంలో 46 మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు మసీదులను వదిలి, హిందూ ఆలయాలనే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ‘48 గంటల్లో కూల్చిన ఆలయాలను పునరుద్ధరించాలి లేదా మసీదులను కూల్చివేయాలి. లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత నేనే వచ్చి తేలుస్తా’ అని హెచ్చరించారు.

News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2025

తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

image

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.