News March 26, 2025
NGKL: గణితం పరీక్షకు 25 మంది గైర్హాజరు

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా బుధవారం 10వ తరగతి పరీక్షల్లో భాగంగా గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 10,560 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 10,535 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
KNR: పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ షురూ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 394 గ్రామపంచాయతీకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెద్దపల్లి జిల్లా 80.84%, జగిత్యాల74% రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80.78%, కరీంనగర్ జిల్లాలో 84.63% నమోదైంది. రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
News December 14, 2025
మంచిర్యాల: జిల్లాలో ముగిసిన రెండవ దశ పోలింగ్

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 2వ దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
దీంతో పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ నెలకొంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను ఎక్కించి అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నారు.
News December 14, 2025
ఓబెరాయ్ హోటల్‌కు 20 ఎకరాల స్థలం

తిరుపతిలో ఓబెరాయ్ హోటల్‌కు ప్రభుత్వం 20ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. SRO రేటులో 1% చొప్పున లీజు అద్దె నిర్ణయించింది. రూ.26.08 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించింది. విద్యుత్ కనెక్షన్ ఖర్చులు, కన్సల్టేషన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఫీజుల సర్దుబాటుకు నిరాకరించింది. TTDతో ఎక్స్ఛేంజ్ డీడ్ కోసం రూ.32.60 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించింది.


