News September 13, 2025
NGKL: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సల్వాది బాలయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అచ్చంపేట, సిద్దాపూర్, ఆమనగల్, మహబూబ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల తోటి పోలీసు సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News September 13, 2025
కిలో టమాటా రూ.4

నిన్న, మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా రేటు ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు(D) పత్తికొండ, నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్లలో కిలో రూ.4 నుంచి రూ.6 మాత్రమే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు పొలాల్లోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.30కి అమ్ముతున్నారు.
News September 13, 2025
అనకాపల్లిలో నేడే మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల హాజరవుతారన్నారు. 25 బహుళ జాతి కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి 18 నుండి 35 సంవత్సరాల లోపు గల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
News September 13, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 18 వరకు గడువు పెంచుతూ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇది చివరి అవకాశం అని, అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.