News January 23, 2026

NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు పోస్టర్ ఆవిష్కరణ

image

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు డీఎమ్ డబ్ల్యూఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్‌లాగ్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు tgmreistelangan.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News March 7, 2026

మెదక్: అంత్యక్రియలకు వెళ్లి.. అనంతలోకాలకు

image

అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల వివరాలిలా.. రామాయంపేటకు చెందిన గాయంతి మల్లేశం(45) శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అనంతరం స్థానిక కొత్తచెరువులో స్నానం చేసేందుకు దిగి, ప్రమాదవశాత్తు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటిలో గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.

News March 7, 2026

జగిత్యాల: ఇంటర్ పరీక్షలకు 97.95% హాజరు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఎనిమిదో రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 30 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు జనరల్ కోర్సుల్లో 4,193 మందిలో 4,138 మంది హాజరై 55 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 847 మందిలో 809 మంది హాజరై 38 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 97.95% హాజరు నమోదైంది. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత జగిత్యా ప్రైవేట్ జూనియర్ కళాశాలను సందర్శించారు.

News March 7, 2026

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.. APCRDAతో పూర్తైన ఒప్పందం

image

అమరావతిలో 55 ఎకరాలలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్(IIULER) ఏర్పాటు చేసేందుకు APCRDAతో శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి అశోక్ పాండేకు CRDA ఎస్టేట్స్ విభాగ అధికారి జుబిన్ రాయ్ సంబంధిత పత్రాలు అందజేశారు. క్యాంపస్ ఏర్పాటుకై తోలి దశలో రూ.300 కోట్ల పెట్టుబడి పెడతామని, న్యాయవిద్యకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని IIULER వర్గాలు తెలిపాయి.