News January 27, 2025

NGKL: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

బిజినెపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 తరగతి ప్రదేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుమతి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఫిబ్రవరి 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, 5వ తరగతితో పాటు 6, 7, 8, 9 తరగతిలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 23న ఉంటుందని తెలిపారు.

Similar News

News November 10, 2025

కురుమూర్తి జాతర పొడిగింపు

image

వర్షాభావం కారణంగా భక్తుల రాక తగ్గడంతో అమ్మపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో అలంకార దర్శనాలను నవంబర్ 17 వరకు పొడిగించారు. ఈ మేరకు పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి ప్రకటించారు. నవంబర్ 17న ఉదయం 10 గంటలకు అలంకారం తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.

News November 10, 2025

TODAY HEADLINES

image

➧ కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్
➧ అనారోగ్యమే అసలైన పేదరికం: సీఎం చంద్రబాబు
➧ ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
➧ వారంలో TG TET నోటిఫికేషన్?
➧ ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి.. బిహార్ ప్రచారంలో లోకేశ్
➧ ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP
➧ డిసెంబర్ 15న IPL వేలం!

News November 10, 2025

సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

image

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండ‌రీ ఆసుప‌త్రులుండ‌గా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుప‌త్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్ద‌రు చొప్పున, మ‌రో 13 ఏరియా ఆసుప‌త్రుల‌కు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుప‌త్రుల‌కు ఇద్ద‌రు చొప్పున స్పెష‌లిస్టుల‌ను నియ‌మించారు. మ‌రో 97 ఆసుప‌త్రుల‌కు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.