News November 18, 2025
NGKL: గ్రామాల్లో మొదలవనున్న ఎన్నికల సందడి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాలలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 460 గ్రామ పంచాయతీలు, 214 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నాయకులు సన్నద్ధమవుతున్నారు.
Similar News
News November 18, 2025
అయిజ: డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం

అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్కూల్ నుంచి మాధవ సినిమా టాకీస్ వైపు వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న డ్రైనేజీలో ఒక మగ మనిషి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దేశంలో పెరిగిన ‘గర్భనిరోధకం’

గర్భనిరోధక మాత్రల వాడకంలో US, చైనా తర్వాత భారత్ నిలిచింది. దేశంలో ఏటా 3.5 కోట్ల ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్(ECP) అమ్ముడవుతున్నట్లు మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదిక వెల్లడించింది. పదేళ్లలో 12% మేర విక్రయాలు పెరిగినట్లు తెలిపింది. వీటిని అధికంగా వాడితే ప్రమాదమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. మరోవైపు కండోమ్‌ల అమ్మకాలు ఇండియాలో ఐదేళ్లలో 17% మేర తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.