News December 22, 2025
NGKL: ఘనంగా మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి వర్ధంతి వేడుకలను నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి వెంకటస్వామి చేసిన సేవలను స్మరించుకున్నారు. అదనపు ఎస్పీతో పాటు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.
Similar News
News December 29, 2025
NRPT: కేజీబీవీలో ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోండి

నారాయణపేట KGBV పాఠశాలలో వంట మనిషి, స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ బాలాజీ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 నుంచి జనవరి 2 లోపు దరఖాస్తులను కేజీబీవీ పాఠశాలలో అందించాలని చెప్పారు. 7వ తరగతి ఉత్తీర్ణులై స్థానిక మహిళలు అర్హులని అన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ కోరారు. వివరాలకు కేజీబీవి పాఠశాలలో సంప్రదించాలని చెప్పారు.
News December 29, 2025
రంపచోడవరం: కొత్త జిల్లాకు పరిపాలనకు అవసరమైన భవనాలు కష్టమే.?

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా పేరిట నూతన జిల్లాకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రంపచోడవరం కేంద్రంలో పరిపాలన కోసం అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు కష్టతరంగా ఉండనుంది. ప్రస్తుతానికి వైటీసీ, పీఎంఆర్సీ భవనాలలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని శాఖల కార్యాలయాలకు భవనాలు ఏర్పాటు స్థానిక అధికారులకు తలనొప్పిగా మారనుంది.
News December 29, 2025
కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దారుకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి

కాల్వ శ్రీరాంపూర్ మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పుల్లూరు జగదీశ్వర్ రావుకి అతి తక్కువ కాలంలోనే డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఇది శుభ పరిణామమని, ఈ పదోన్నతి వారి సేవలకు బహుమానంగా భావిస్తూ ఈ సందర్భంగా మండల విద్యాధికారి సిరిమల్లె మహేష్ వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో ప్రజలకు సేవలందిస్తూ.. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.


