News February 5, 2025

NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

image

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Similar News

News February 5, 2025

పెద్దగట్టు జాతరపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతరపై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని, జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి వసతి, వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. వారి వెంట పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య, అదనపు కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ రవి ఉన్నారు.

News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా ఉండేందుకు నరేశ్ నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

error: Content is protected !!