News March 10, 2025
NGKL: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. పోలీసుల వివరాలు.. NGKL మండలం వనపట్లకు చెందిన అనూష(32) బైక్‌పై వస్తుండగా.. కొల్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. HYDలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 10, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 103 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 103 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు సెట్ నంబర్ 2 ప్రశ్నాపత్రాలను వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6,339 మంది విద్యార్థులకు గానూ 6,236 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
News March 10, 2025
అనంతగిరి: కుక్కల దాడిలో జింక మృతి

వీధి కుక్కల వేటలో జింక (దుప్పి ) మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో వీధి కుక్కల వేటలో జింక మృతి(దుప్పి ) చెందిందని స్థానికులు తెలిపారు. ఉదయం గుంపుగా వచ్చిన కుక్కలు మూగజీవాలపై విరుచుకుపడ్డాయని చెప్పారు.
News March 10, 2025
చంద్రయ్య హత్య కేసు CIDకి అప్పగింత

AP: పల్నాడుకు చెందిన TDP కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును CIDకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసు దస్త్రాన్ని వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2022లో వెల్దుర్తి (M) గుండ్లపాడులో ప్రత్యర్థులు చంద్రయ్యను గొంతు కోసి చంపారు. హత్యకు ముందు జై జగన్ అనాలని నిందితులు చంద్రయ్యను బెదిరించారనే ఆరోపణలున్నాయి. కేసు రీఓపెన్ చేయాలని తొలుత భావించిన ప్రభుత్వం తాజాగా CIDకి అప్పగించింది.