News April 5, 2025
NGKL: చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఈనెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. లింగాల మం. కొత్తకుంటపల్లికి చెందిన మధు(22) తమ్ముడు సాయితో కలిసి పనిమీద బైక్‌పై బయటికి వెళ్లారు. బైక్ అదుపుతప్పి చెట్టుని ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయి. మధు చికిత్స పొందుతూ మరిణించారు. శుక్రవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 5, 2025
రామానాయుడు స్టూడియోకు నోటీసులు

AP: విశాఖలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ హరీన్‌ధీర ప్రకటించారు. 2 వారాల సమయం ఇచ్చి, వారి వివరణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చిత్ర పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం 34 ఎకరాలకు పైగా భూమి కేటాయించామని, 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని వారు ప్రతిపాదించారని తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు హరీన్‌ధీర వెల్లడించారు.
News April 5, 2025
శ్రీరామనవమి వేడకలు.. తిరుపతి SP కీలక ఆదేశాలు

తిరుపతి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని అని.. ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలని సూచిస్తుందన్నారు. ధర్మాన్ని కాపాడాలంటూ శ్రీరామచంద్రుడు చూపిన మార్గం వైపు ప్రజలు నడవాలన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎక్కడ డీజేలు పెట్టవద్దని ఆయన హెచ్చరించారు.
News April 5, 2025
రైల్వే కోడూరు: తల్లిదండ్రులపై కేసు నమోదు

రైల్వే కోడూరు పట్టణంలో బైక్ నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులో తీసుకుని వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ బాబు తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన వాహన చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.