News March 21, 2025

NGKL: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. బిజినేపల్లి మం. సల్కర్‌పేటకు చెందిన శ్రీనివాసులు(55) బైక్‌పై సొంతూరుకి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను HYDలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News March 28, 2025

శ్రీశైల మహా క్షేత్రంలో పుష్పాలతో అలంకరణ

image

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణంలో వివిధ పుష్పాలతో అలంకరణ ఘనంగా చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర భక్తులు భారీ ఎత్తున శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ సందర్భంగా వారికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

News March 28, 2025

రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహించేంది ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు. వైసీపీ ఎంపీటీసీలకు భద్రత కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులపై పోలీసులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.

News March 28, 2025

మంగోలియా ఎడారిలో గోళ్ల డైనోసార్ల అవశేషాలు

image

మంగోలియాలోని గోబీ ఎడారిలో నివసించిన 2 గోళ్ల డైనోసార్ జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డ్యుయోనైకస్ సొబాటరీగా పిలిచే ఈ డైనోసార్లు వాటి వెనుక కాళ్లపై నిల్చునేవని, ఒక మోస్తరు పరిమాణంలో సుమారు 260kgs బరువులో ఉండేవని గుర్తించారు. పొడవైన, వంపు తిరిగిన గోళ్లు కలిగి ఉండి, వృక్ష సంపదను తిని బతికినట్లు భావిస్తున్నారు. ఇలాంటి డైనోసార్లను జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రంలో చూపించారు.

error: Content is protected !!