News April 25, 2025
NGKL: చివరి దశకు చేరుకున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి కోసం 62 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి, బురద తొలగింపు దాదాపు పూర్తి అయినప్పటికీ డేంజర్ జోన్ సమీపంలో మాత్రం సహాయక చర్యలు ప్రారంభించలేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది.
Similar News
News December 14, 2025
అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్(60) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. న్యూయార్క్‌లోని ఆయన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారని మేనేజర్ తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి సస్పెక్ట్ యాక్టివిటీస్ లేవని పోలీసులు తెలిపారు. ఎన్నో విలన్ పాత్రలతో గ్రీన్ ప్రేక్షకులను అలరించారు. పల్ప్ ఫిక్షన్, ది మాస్క్ చిత్రాలు ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టాయి.
News December 14, 2025
MDK: ఈనెల 20న సర్పంచ్‌లకు బాధ్యతలు

పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కొత్త సర్పంచులు ఈనెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. 3విడతల్లో జరిగిన ఎన్నికల అనంతరం, ఎన్నికైన వారు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేలా తేదీని ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ గెజిట్ విడుదల చేసింది.ఈనెల 20వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.సర్పంచులు బాధ్యతలు చేపట్టిన వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం కోరనుంది.
News December 14, 2025
రాంనగర్‌లో విషాదం: నాడు తండ్రి.. నేడు కుమారుడు!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. పెళ్లి ఏర్పాట్ల వేళ ఈ దుర్ఘటన కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.


