News August 16, 2025
NGKL: జటాయువు పేరు మీద పుట్టిన జటప్రోలు

కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో ఉన్న మదనగోపాలస్వామి ఆలయం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలోని గాలిగోపురం, శిల్పకళా నైపుణ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. 450 ఏళ్ల చరిత్ర ఉన్న జటప్రోలు-కొల్లాపూర్ సంస్థానాల నిర్మాణ శైలికి నిలువుటద్దం. జటాయువు పేరుమీద జటాయుపురమై, తర్వాత జటప్రోలు అన్న పేరు ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి.
Similar News
News August 16, 2025
పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్స్: ఈసీ

ఎలక్టోరల్ రోల్స్‌పై పలు పార్టీలు అనుమానాలు లేవనెత్తడంపై ECI ప్రకటన జారీ చేసింది. ఎలక్టోరల్ రోల్స్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని, వీటి ప్రిపరేషన్లో ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు పాల్గొంటాయంది. తప్పులు గుర్తించేందుకు తగిన సమయం ఉంటుందని పేర్కొంది. సరైన సమయంలో సమస్యలు లేవనెత్తితే పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపింది. చట్ట ప్రకారం, పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్ సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది.
News August 16, 2025
రామకృష్ణ కాలనీలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి కొడుతూ చిన్నారులు సంబరపడ్డారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పంటలు బాగా పండాలని కోరుకుంటూ కృష్ణుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో యాద సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
News August 16, 2025
WNP: డ్రైనేజీలో పడి గ్రామ పంచాయతీ వర్కర్ మృతి

వనపర్తి మండలంలోని అంకూరు గ్రామంలో శనివారం మురికి కాలువ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి ఓ గ్రామ పంచాయతీ వర్కర్ మృతి చెందాడు. రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపిన వివరాలు.. అంకూరు గ్రామానికి చెందిన కొమ్ము రాములు (43) రైతు వేదిక ముందు డ్రైనేజీని శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.