News March 9, 2025
NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News December 11, 2025
MDK: ఆ ఊరిలో ఒక్క ఓటు తేడాతో గెలుపు

రేగోడ్ మండలంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బేగరి పండరి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి హరిజన సత్తయ్య మీద ఒక ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
News December 11, 2025
VJA: గుండు కొట్టించు.. వంద సమర్పించు.!

భవానీ మాల విరమణకు వచ్చిన భక్తుల నుంచి కేశఖండన శాలల సిబ్బంది అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. తలనీలాలు సమర్పించేందుకు టికెట్‌కు రూ.40 ఉన్నప్పటికీ, అదనంగా రూ.100 ఇవ్వాలని క్షవరకులు డిమాండ్ చేస్తున్నారు. ముందు డబ్బులు ఇస్తేనే గుండు చేస్తామని ఆంక్షలు పెడుతున్నారు. మైకుల్లో డబ్బులు చెల్లించవద్దని ప్రకటిస్తున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 11, 2025
విశాఖ కోస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ఈ-ఆఫీస్’ శిక్షణ

విశాఖ కోస్టల్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ఎస్పీ జీబీఆర్.మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్‌ఐసీ బృందం పోలీసు సిబ్బందికి ఈ-ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల వినియోగంపై సమగ్ర శిక్షణ ఇచ్చింది. పరిపాలనలో పారదర్శకత, కాగిత రహిత సేవల కోసమే ఈ శిక్షణని అదనపు ఎస్పీ తెలిపారు.


